నా భార్య ప్రియుడు చనిపోయాడు... కానీ ఈమధ్య అతడి లవ్ లెటర్‌తో నా భార్య...

సోమవారం, 16 నవంబరు 2015 (23:05 IST)
నా భార్య పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడంలేదు. ఆమె చాలా అందగత్తె అని 15 ఏళ్ల క్రితం మా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత తెలుసుకున్నాను ఆమెకు ఓ ప్రియుడు ఉన్నాడని. ఐతే మా పెళ్లి తర్వాత అతడితో సంబంధాలు కట్ చేసుకున్నానని చెప్పింది. నాలుగేళ్ల క్రితం అతడు చనిపోయాడు. కానీ ఈమధ్య ఓ రోజు అతడు రాసిన ప్రేమలేఖలను తీసుకుని చదువుతూ ముద్దుపెట్టుకుంటూ కనబడింది. ఆమె గమనించకుండా అలా దాక్కుని చూస్తూ ఉన్నాను. ఆ లేఖలతో ఏదో మాట్లాడుతోంది. ఆమె ప్రియుడిని వదల్లేదా...? చనిపోయినా కూడా ఇంకా అతడి జ్ఞాపకాలతోనే ఉన్నదా... నా పరిస్థితి ఏమిటి...? నాకేమీ అర్థం కావడంలేదు...
 
ఆమె పాతజ్ఞాపకాల నుంచి బయటకు రానట్లు అర్థమవుతుంది. అతడు భౌతికంగా లేకపోయినా మానసికంగా అతడి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇకపోతే ఆమెను ఆ దారి నుంచి బయటకు రప్పించాల్సిన బాధ్యత మీదే. 15 ఏళ్ల క్రితం ప్రేమ అయినప్పటికీ ప్రేమ అనేది మరిచిపోవడం చాలా కష్టమైనదే. మరీ ఆమె ఆ ఆలోచనల్లోనే మునిగితేలుతుంటే మానసిక వైద్యుడికి చూపించండి. కౌన్సిలింగ్ ద్వారా మెల్లమెల్లగా ఆ ఆలోచనల నుండి దూరం కావచ్చు.

వెబ్దునియా పై చదవండి