మాది బాగా ధనవంతుల కుటుంబం. మా నాన్నగారు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. వారిలో పెద్ద భార్య కుమారిడిని నేను. ఇటీవల నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఐతే నాలో ఉన్న బలహీనతను ఇప్పటివరకూ ఎవ్వరికీ చెప్పలేదు. అందమైన అమ్మాయిలను చూసినా, సెక్స్ బొమ్మలు చూసినా నా స్నేహితులకు అంగం స్తంభిస్తుందట.
కానీ నాకు మాత్రం అలా లేదు. ఎంత చేసినా అంగం స్తంభించకుండా ఉంటోంది. మా నాన్న ఇద్దరు భార్యలతో ఆరుగురు పిల్లలకి జన్మనిస్తే నాలో సెక్స్ సామర్థ్యం లేకపోవడం ఏమిటో ఆందోళనగా ఉంది. సమస్యను బయటకు చెప్పాలంటే సిగ్గుగానూ, పరువు పోతుందేమోనని కుమిలిపోతున్నాను. ఐతే పెళ్లి కుదిరితే వ్యవహారం బయటపడుతుందని భయంగా ఉంది. ఏం చేయాలి?