మొబైల్, ఇంటర్నెట్లలో అశ్లీల చిత్రాలు... సెక్స్ దృశ్యాలను చూసే పురుషులు తమ ప్రియురాళ్లు, భార్యలు కూడా బ్లూ ఫిల్మ్‌లో సెక్స్ యువతుల్లా ప్రవర్తించాలనీ, ఆ భంగిమలే కావాలని మారాం చేయడమూ పెరిగిపోతున్నదన్నది నిజమే కావచ్చు.
మగవారి ఈ వింత ప్రవర్తనుకు విసిగిపోయిన వనితలు తమ మనసులో గూడుకట్టుని ఉండే లైంగిక ఆలోచనలను భాగస్వామితో పంచుకోవడం లేదని తేలింది. అలాగాని సెక్స్ సీన్లు చూసే పురుషులందరూ అచ్చు అలాంటి రతినే ఇష్టపడతారనుకోవడమూ పొరపాటే. అంతేకాదు అశ్లీల చిత్రాలు, సెక్స్ బొమ్మలను చూసేవారిలో వివాహమైనవారే అధికులు ఉంటున్నారు.
నచ్చిన వ్యక్తితో సెక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కలిసి చూడటం తప్పు కానేకాదని వాదిస్తున్నవారి సంఖ్యా ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో మనసులు కలిసిన అమ్మాయి - అబ్బాయి కలిసి సెక్స్ బొమ్మలు, సెక్స్ సీన్లు చూడటం మామూలైపోతోంది. కనుక ఇది రోగమనేకంటే ఓ అలవాటుగా మారిపోయిందని చెప్పాల్సి వస్తుంది.