సెక్స్ చేసేటపుడు సంబరంతో చేశా... ముగిశాక రక్తం చూసి మంచానపడ్డాను...

శనివారం, 11 అక్టోబరు 2014 (18:49 IST)
నా గర్ల్ ఫ్రెండును ఎన్నాళ్లగానో సెక్స్ కోసం బతిమాలగా ఒప్పుకుంది. ఎంతో ఆనందంతో సెక్సులో పాల్గొన్నాను. సెక్స్ ముగిసిన తర్వాత అంగంపై రక్తం కనబడింది. ఆమెకు ఏమైనా నెలసరి అనే డౌటుతో అడిగితే అదేమీ లేదని అంది. నా పురుషాంగం నుంచే రక్తం వచ్చి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీనికితోడు సెక్స్ చేసిన దగ్గర్నుంచి పురుషాంగంలో నొప్పి మంటగా ఉంటోంది. జ్వరం కూడా వచ్చేసింది. మంచం పట్టాను. డాక్టరు వద్దకు వెళ్లాలంటే సిగ్గుగా ఉంది. ఈ విషయం పేరెంట్స్ తో చెప్పాలంటే భయంగా ఉంది. ఏం చేయాలో తెలియడంలేదు....
 
పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొన్నప్పుడు కలిగే భయాలు ఇలానే ఉంటాయి. రక్తం కనబడటానికి కారణం చాలానే ఉంటాయి. ఆమెకు నెలసరి రాలేదని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు అనుకున్నదానికంటే ముందుగా కూడా రావచ్చు. అలాగే సెక్స్ చేసినపుడు పురుషాంగం బాగా స్తంభించి పురుషాంగం పూర్వచర్మ బిగుతుగా ఉండి సెక్స్ చేస్తున్నప్పుడు కింది భాగంలో కట్ అవడం వల్ల కూడా రక్తం రావచ్చు. 
 
ఇంకా ఆమె యోనిలో కన్నెపొర చిరిగినపుడు కూడా ఇలాంటి పరిస్థితి కనబడవచ్చు. ఇక పురుషాంగంలో నొప్పి, మంటకు కారణాలు సెక్స్ చేసినందువల్లే అని చెప్పలేం. ఏదేమైనప్పటికీ ఎలాంటి సిగ్గు పడకుండా వైద్యుడిని సంప్రదించి సమస్యను వివరిస్తే తగిన చికిత్స చేస్తారు.

వెబ్దునియా పై చదవండి