నేను మా బావ త్వరలో పెళ్లాడబోతున్నాం. ఐతే అంతకంటే ముందే సెక్సులో పాల్గొందామని గోల చేస్తున్నాడు. సెక్సులో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని అంటే... బాత్ టబ్‌లో హాట్ వాటర్‌లో పాల్గొంటే గర్భం రాదని తన స్నేహితులు ఎవరో చెప్పారట. అలా చేద్దామని బతిమాలుతున్నాడు. నిజంగా అలా వేడి నీటిలో సెక్సులో పాల్గొంటే గర్భం రాదా...?
బాత్ టబ్ లో వేడి నీటిలో స్త్రీపురుషులు సెక్సులో పాల్గొంటే గర్భం రాదని చెప్పలేం. ఎందుకంటే పురుషాంగం యోనిలో ప్రవేశించాక వీర్య కణాలు గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించిన వీర్య కణాలు గర్భధారణకు కారణమవుతాయి. ఐతే వేడి నీటిలో ఉన్నందువల్ల వీర్య ఉత్పత్తి సెన్సిటివ్ గా మారినప్పటికీ గర్భం రాదని మాత్రం చెప్పలేం. అందువల్ల బాత్ టబ్ లో వేడి నీటిలోనే సెక్స్ చేయాలనుకునేవారు గర్భం రాదనే నమ్మకాన్ని విడనాడాల్సిందే.