కండోమ్ వేసి సెక్స్ చేస్తుంటే.. మజా లేదని పీకిపారేస్తోంది.. ఏం చేయాలి?

సోమవారం, 6 ఏప్రియల్ 2015 (15:05 IST)
నాకు ఇటీవలే వివాహమైంది. ఇద్దరం విద్యావంతులం. ఉద్యోగస్తులం కూడా. వివాహమైన తర్వాత మూడు నెలల పాటు శృంగారాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. ఈ మూడు నెలల్లో ఆమె నుంచి ఒక విషయాన్ని గమనించాను. కండోమ్ వేసి సెక్స్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కండోమ్ వేసి సెక్స్ చేస్తుంటే మజా లేదంటూ దాన్ని పీకిపారేస్తోంది. నాకు మాత్రం కొంతకాలం పిల్లలు లేకుండా ఉండాలని ఉంది. ఎందుకంటే.. పిల్లలు లేకుండానే దాంపత్య సుఖాన్ని మరింతగా ఎంజాయ్ చేయాలన్నదే నా బలమైన కోర్కెగా ఉంది. అందుకే గర్భం రాకుండా ఉండేందుకు వీలుగా అలా చేస్తున్నా. నా భార్యను తృప్తి పరిచే మార్గమేంటి.? 
 
సాధారణంగా సురక్షితమైన సెక్స్, సుఖవ్యాధుల బారిన పడకుండా ఉండే నిమిత్తం కండోమ్స్‌ను ధరించాలని సెక్సాలజిస్టులు సలహాలు ఇస్తుంటారు. అయితే, ఈ కండోమ్‌లు ధరించి సెక్స్ చేయించుకునేందుకు చాలా మంది భార్యలు లేదా మహిళలు ఇష్టపడరు. దీనికి కారణం సెక్స్‌లో వారికి సరైన తృప్తి కలగక పోవడమే. అలాగే, మరికొంతమందిలో అపోహలున్నాయి. కండోమ్ ధరించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని కొందరు అనుకుంటారు. 
 
ఇలాంటి భావన చాలా మంది మహిళల్లో ఉంటుంది. అందువల్లే వారి నుంచి ఈ తరహా అయిష్టత వ్యక్తమవుతుంది. అయితే, పిల్లలు ఇపుడే వద్దనుకునే వారు మాత్రం విధిగా కండోమ్ లేదా ఇతర గర్భ నిరోధక సూత్రాలను పాటించి తీరాల్సి ఉంటుంది. అందువల్ల కండోమ్ ధరించి సెక్స్ చేయడం వల్ల సంతృప్తి కలగడం లేదని చెప్పే మహిళలకు పూర్తిగా వివరించాలి. కండోమ్ ఎందుకు ధరిస్తున్నామో వారికి తెలియజేయాలి. అప్పటికీ సమ్మతించక పోతే.. కండోమ్ లేకుండానే సెక్స్ చేస్తూ.. భావప్రాప్తి పొందే సమయంలో వీర్యాన్ని బయట స్ఖలించేలా జాగ్రత్త వహించడం మంచింది. ఇలా చేయడం వల్ల గర్భం వచ్చేందుకు ఆస్కారం లేకపోలేదు. 

వెబ్దునియా పై చదవండి