నాకు, నా భర్తకు ఒకేసారి భావప్రాప్తి కలగడం లేదు ఎందుకని?

గురువారం, 31 జులై 2014 (17:45 IST)
మాది బెంగుళూరు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాం. వివాహమై ఒక యేడాది అయింది. అయితే, శృంగారంలో బాగానే సంతృప్తి పొందుతున్నాం. అయితే, భావప్రాప్తి మాత్రం ఇద్దరికీ ఒకేసారి పొందలేక పోతున్నాం. కారణం తెలియడం లేదు. ఒకేసారి అలా జరగకపోతే సంతానం కలగదని ఏదో ఒక పుస్తకంలో చదివాను. మా యిద్దరి సమస్యకు పరిష్కార మార్గమేంటి? 
 
దాంపత్యంలో పాల్గొనే భార్యాభర్తలకు ఒకేసారి భావప్రాప్తి కలగాలనే నియమ నిబంధన ఏదీ లేదు. అన్ని సందర్భాల్లో అలా జరగడం కూడా ఉండదు. దాంపత్య జీవితంలో సంతృప్తి పొందడమే ముఖ్యం. ఏ కారణం చేత అయినా ఇద్దరిలో ఎవరో ఒకరికి ముందుగా భావప్రాప్తి జరిగితే ఆ సుఖం పొందినవారు భాగస్వామి / భాగస్వామిని కూడా ఏ ప్రక్రియ ద్వారానైనా అదే విధంగా జరిగేలా చూడటం మంచిది. 

వెబ్దునియా పై చదవండి