శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది. అల్లం రసంతో కొద్దిగా తేనెను కలుపుకుని తీసుకుంటే శ్వాసకోశ వ్యాధికి మంచి ఉపశమనం కలుగుతుంది. ఎక్కుళ్ళు ఎక్కువగా వస్తున్నప్పుడు కొద్దిగా తేనెను తీసుకుంటే మంచిది. పాలలో చక్కెరకు బదులుగా కొద్దిగా తేనెను కలిపి సేవిస్తే బలహీనంగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. పొడిదగ్గున్నవారు తేనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.