1. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.
3. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతూంటే నివారణ కల్గుతుంది.
4. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
5. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది.