ఆ సమస్యతో బాధపడేవారు రాత్రివేళ అరస్పూను తానికాయ గింజల చూర్ణాన్ని తింటే...
శుక్రవారం, 5 జులై 2019 (16:06 IST)
ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషదాలను ఇచ్చింది. వాటిల్లో తానికాయ ఒకటి. దీనిలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తానికాయ చూర్ణంతో పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా శృంగారం సమస్యలతో బాధపడేవారికి తానికాయ చూర్ణం ఒక ఔషదంలా పని చేస్తుంది. దీనిలో ఉన్న ఔషధ విలువలేమిటో తెలుసుకుందాం.
1. ఒక స్పూను తానికాయ చూర్ణనికి తగినంత తేనె కలిపి చప్పరించి మింగుతూ ఉంటే బొంగురు గొంతు సమస్య పోవడంతో పాటు గొంతునొప్పి, దగ్గు తగ్గుతాయి.
2. తానికాయ పెచ్చుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి ఒక స్పూను మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే, కంటికి బలం చేకూరడంతో పాటు, కంటి చూపు వృద్ది చెందుతుంది.
3. మూడు గ్రాముల తానికాయ చూర్ణానికి ఏడు గ్రాముల పాత బెల్లం కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకుంటే మగవారిలో శృంగారం శక్తి పెరుగుతుంది.
4. తులం తానికాయ చూర్ణానికి రెట్టింపు తేనె కలిపి, రోజూ రెండు పూటలా సేవిస్తుంటే ఉబ్బసం వ్యాధి త్వరగా తగ్గేందుకు తోడ్పడుతుంది.
5. తానికాయ పెచ్చులు, అశ్వగంధ సమపాళ్లలో తీసుకుని చేసిన చూర్ణానికి సమానంగా పాత బెల్లం కలిపి తీసుకుంటే వాతం వల్ల వచ్చే గుండె జబ్బులు తగ్గుతాయి.
6. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరస్పూను గింజల పప్పు చూర్ణాన్ని రాత్రి వేళ నిద్రకు ముందు నమిలి తింటే చక్కని నిద్ర పడుతుంది.