మిరపకాయ తింటే ఆ శక్తి పెరుగుతుందా...?

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (16:13 IST)
సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. అయితే మిరపకాయలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రధానంగా మిరపకాయ మూత్ర వ్యాధులు గల వారికి హాని కలిగిస్తుంది. వారు మిరపకాయలకు దూరంగా ఉండడమే మంచిది. 
 
మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. ఆహారాన్ని పచనం జేసి, విరేచనాన్ని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.
 
మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. పావు కేజీ ఆముదంలో రెండు ఎండు మిరపకాయలు వేసి మరిగించి చల్లారిన తరువాత కీళ్లకు మర్థనా చేసుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నూనెను ఎక్కువగా పూసి రుద్దుతుంటే బొబ్బలెక్కే ప్రమాదముంది. మితంగా వాడుకోవాలి.
 
కొద్ది కారము, దానికి సమానంగా ఇంగువ, పిప్పరమెంతులను కలిపి అజీర్తి విరేచనాలతో బాధపడేవారికి రోజుకు 2-3 పర్యాయాలు కొద్దిగా రాస్తుంటే విరేచనాలు తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి