కొత్తప్లాస్టిక్ వస్తువులను కొని వాటి వాసనలు తట్టుకోలేకపోతున్నారా...

సోమవారం, 25 జూన్ 2018 (16:02 IST)
ప్లాస్టిక్ వస్తువులను సులభంగా క్లీన్ చేయాడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు. ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా వాటిని చల్లటి నీటితో కడిగేయాలి. తరువాత ఒక టబ్ నీటిలో 10 నిమిషాలు ఆ వస్తువులను నానబెట్టాలి. ఇలా చేయడం వలన పాతవాసనలు తొలగిపోతాయి. 10 నిమిషాల తరువాత బయటకు తీసి, పొడి బట్టతో తుడవటం వలన వాసన తొలగిపోతుంది.
 
కొత్తప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటినుండి కొత్తగా ప్లాస్టిక్ వాసన వస్తుంటే న్యూస్ పేపర్ తీసుకుని బాగ ఉండచుట్టి ప్లాస్టిక్ వస్తువులలో స్టఫ్ చేసి పెట్టాలి. ఇది ప్లాస్టిక్ వాసన తొలగించడానికి చాలా సహాయపడుతుంది. తరువాత మరుసటి రోజు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ వస్తువులకు అప్లై చేసి ఒకటి లేదా రెండు రోజులు అలానే ఉంచి మంచి నీటితో కడుక్కుంటే మెుండి మరకులు తొలగిపోతాయి. ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ మార్గం నిమ్మరసం. నిమ్మతొక్కతో ప్లాస్టిక్ వస్తువులను రుద్ది కడగడం వలన ప్లాస్టిక్ వాసన ఇతర ఆహార పదార్థాల వాసనలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు