ఒత్తిడిగా వున్నప్పుడు మౌనంగా ఉండొద్దు..

ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:57 IST)
ఒత్తిడిగా వున్నప్పుడు మౌనంగా ఉండొద్దని మానసిక నిపుణులు అంటున్నారు. ఒత్తిడితో చిరాగ్గా ఉంటే చాలా ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉంటే మంచిది కాదు. ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు ఆరోగ్యంతో ఉండాలి. ఇందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని అలవాటుగా చేసుకోవడం మంచిది.  అందుకే ఎప్పటికప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి. 
 
గందరగోళ పరిస్థితిని దూరం చేసుకోవడం మంచిది. అదే దీర్ఘకాలంలో ఒత్తిడిగా మారుతుంది. అలా కాకుండా రేపు చేయాల్సిన పనులేంటో ముందే ఆలోచించుకోండి. ఉదయం పూట కంగారు ఉండదు. ఒత్తిడిగానూ అనిపించదు. ఇలా ప్రణాళిక ఉండటం వల్ల ఉద్యోగినులకు పనిచేసే చోట ఉత్పాదకతా పెరుగుతుంది. 
 
తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్లు అనిపిస్తాయి. కాబట్టి అన్నివేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి