మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పోటి ప్రపంచంలో కనీసం మంచి నీటిని త్రాగడం కూడ మరిచిపోతున్నాం. దీని వలన మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మంచినీళ్ళు త్రాగడం వలన పెద్ద ప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్తరక్తం తయారీకి, కండర కణాల వృద్ధిని పెంచుతుంది. మనం ఉదయాన్నే లీటరు నీటిని త్రాగడం వలన 24 శాతం మెటబాలిజాన్ని పెంచుతుంది.
ఫలితంగా బరువు తగ్గడానికి ఉపయోగవడుతుంది. సాధ్యమైనంతవరకు ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నీటిని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదని కొందరు అభిప్రాయం. అది నిజం కాదు. నీరుకి జీర్ణశక్తిని పెంచే లక్షణం వుంది. శరీరంలో మలినాలను విసర్జింపజేసి మూత్రపిండాలు సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తిస్తాయి.