ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే ఈ అనారోగ్యాలన్నీ పరార్

సిహెచ్

మంగళవారం, 19 మార్చి 2024 (22:42 IST)
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి.
ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి.
తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి.
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి.
తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
మానసిక ఒత్తిడికి గురైనవారు తులసి నీరు తాగుతుంటే సమస్య దూరమవుతుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు