లిక్కర్ తాగడం తగ్గించండి.. గుండెజబ్బుల్ని పారద్రోలండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు యుక్తవయస్సులోనే మితిమీరి లిక్కర్ తీసుకుంటే గుండెజబ్బులు, పక్షవాతం సోకే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జబ్బులు యుక్తవయస్సులోనే పొడసూపుతుందని... వృద్ధులతో సమానంగా యువకుల్లోనూ ఈ బెడద ఉంటుందని శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనం ద్వారా అభిప్రాయపడుతున్నారు.
ఇలియానియస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. యుక్తవయసులోనే అతిగా మద్యం తాగే అలవాటు ఉంటే.. అధిక రక్తపోటు, కొవ్వుశాతం పెరగడం వంటివి కూడా ఎక్కువగా ఉండి.. గుండెజబ్బులకు, పక్షవాతానికి దారి తీస్తాయట.