ప్రతి రోజు మీరు తీసుకునే భోజనంలో రెండుపూటలా ఏడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. భోజనం చేసేటప్పుడు కాసింత నీటిని మాత్రమే సేవించండి. ఎక్కువ నీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సేవించకూడదు. భోజనం చేసిన తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కలించండి. భోజనం చేసిన తర్వాత ఐదు వందల అడుగులు నడవండి. రాత్రిపూట భోజనం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య చేయండి.