కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటి ఫోన్లతో పాటు టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో శరీరానికి శ్రమ తగ్గిపోయింది. కానీ కంటికి శ్రమ ఎక్కువైపోయింది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో పాటు చేతుల్లో స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో కంటికి శ్రమ పెరిగిపోవడంతో పాటు కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకోసారి కొన్ని సెకన్లపాటు విరామం తీసుకుని ఓ 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువుని చూడాలి. అలా చేయడం ద్వారా కళ్ళు నీరుకారడం, ఎర్రబారడం, దురద మంట రావడం, పొడిబారడం వంటి సమస్యలను అదిగమించవచ్చు. అంతేకాదు పని మధ్యలో కొన్నిసార్లు లేచి 20 అడుగులు నడవడం వల్ల శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
అలాగే కంటి కోసం ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వారానికి రెండుసార్లు చేపలు.. నెలకోసారి మాంసం తీసుకునే వారిలో కంటి సమస్యలు ఉండవని రోజూ ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ సేవిస్తే కంటికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.