బ్రెయిన్ బూస్ట్ ఫుడ్ ఏంటో తెలుసా?

శనివారం, 21 జనవరి 2023 (22:37 IST)
పండ్లు, కూరగాయలు, టీలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును దెబ్బతినకుండా కాపాడతాయి. ఇంకా మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తినిచ్చేవి ఏమిటో తెలుసుకుందాము.
 
మెదడుకి బూస్ట్‌నిచ్చే ఆహారాల గురించి మాట్లాటుకుంటే చేపలు అగ్రస్థానంలో ఉంటాయి.
 
బ్లూబెర్రీస్ తింటుంటే మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎంతో దోహదపడుతాయి.
 
పసుపు కీలకమైన పదార్ధం. ఇది మెదడుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
 
బ్రోకలీ యాంటీఆక్సిడెంట్లతో సహా శక్తివంతమైనది. ఇది కూడా బ్రెయిన్ పవర్ ఫుడ్.
 
గుమ్మడికాయ గింజల్లో మెదడును ఫ్రీ-రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడే గుణాలున్నాయి
 
గింజధాన్యాలు తినడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు మెదడుకి కూడా మేలు చేస్తాయి.
 
ఆరెంజ్‌లో వున్న విటమిన్ సి మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
 
విటమిన్లు B6 మరియు B12, ఫోలేట్, కోలిన్ వంటి మెదడు ఆరోగ్యానికి సంబంధించిన అనేక పోషకాలకు గుడ్లు మంచి మూలం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు