చెవి నుంచి చీము కారడం, నొప్పి పుట్టడం, చెవి అంతర్భాగాల్లో ఇన్‌ఫెక్షన్లు వంటి చెవి సంబంధిత సమస్యలతో అనేక మంది బాధపడుతుంటారు. పైగా, చెవి నొప్పి వచ్చిందంటే అల్లాడిపోతారు. పైగా, ఓ పట్టాన తగ్గదు. అయితే వీటిని వెంటనే నయం చేయాలంటే రెండు చుక్కల వెల్లుల్లి రసం సరిపోతుందట. ఈ వెల్లుల్లి రసాన్ని ఆలివ్ ఆయిల్‌తో కలిపి చెవిలో వేసుకుంటే చాలు చెవి సంబంధింత సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.
వెల్లుల్లి రెబ్బలతో తీసిన రసాన్ని ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌తో కలిపి ఈ మిశ్రమంలో కొద్దిగా దూదిని వేయాలి. అలా కొంతసేపు ఉన్నాక ఆ దూదిని తీసి దాన్ని సమస్య ఉన్న చెవిపై పెట్టి అందులో ఉండే మిశ్రమాన్ని చెవిలో పడేట్టుగా దూదిని పిండాలి. రెండు చుక్కలు చెవిలో పడగానే దూదిని తీసేయాలి. అలా ఒక నిమిషం పాటు ఉంటే చాలు, సమస్య తీవ్రత తగ్గుతుంది.
వెల్లుల్లి రసం, ఆలివ్ ఆయిల్‌లలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కనుకనే అవి రెండింటినీ కలిపి మిశ్రమంగా చేసి చెవిలో వేయడం వల్ల చెవుల్లో ఉండే బాక్టీరియా, హానికారక క్రిములు నాశనమై చెవులు శుభ్రంగా మారుతాయి. చెవుల్లో చీము పట్టే సమస్య ఉన్నా తక్షణం తగ్గిపోతుంది.