వేకువజామున నిద్రలేస్తే ఎన్ని లాభాలో...

మంగళవారం, 27 నవంబరు 2018 (17:38 IST)
చాలామందికి ఉదయాన్నే నిద్రలేవడం చాలా బద్దకం. కొందరైతే ఉదయం 10 గంటల వరకు నిద్రలేవరు. ఇలాంటి వారు రోజంతా ఎంతో బడలికతో ఉంటారు. అయితే, వేకువజామున నిద్రలేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
* నిజానికి సూర్యోదయానికి ముందున్న సమయంలో వాతావరణంలో ప్రశాంత జ్ఞానదివ్యతరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల శరీరం, మనసులో చురుకుదనం పెరుగుతుంది. వేకువజామున నిద్రలేచి చదివేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి. 
 
* వేకువజామునే నిద్రలేవడం వల్ల అవగాహన, మేథోశక్తి, మనోవికాసం బాగా పెరుగుతాయి. అతి తేలికగా మేధావులు అవ్వగలరు. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే.. రాత్రి ఆలస్యంగా చదువుకుని పడుకోవడం వల్ల వేకువజామునే సులభంగా నిద్రలేవొచ్చు. 
 
* ముఖ్యంగా, ఆడపిల్లలైతే ఉదయాన్నే నిద్రలేవడం వల్ల తల్లికి చేదోడువాదోడుగా ఉండొచ్చు. ఇంటి పనుల్లో శిక్షణ కూడా పొందినట్టుగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు