ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తాగొచ్చు. కానీ, చాలామంది టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. అది కూడా ఎలాగంటే.. పళ్లు తోమకుండానే.. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలకు దారిచూపినట్టవుతుంది. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
1. నిద్రించే సమయంలో రక్తప్రసరణ అంతగా జరుగదు. కాబట్టి నిద్రలేచిన తరువాత తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేసినప్పుడు అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోయి.. దాంతో రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
3. సాధారణంగా చాలామంది ఉదయాన్నే తినకుండానే పాఠశాలకు, కళాశాలకు, ఆఫీసులకు వెళ్తుంటారు. దీని కారణంగా బరువు విపరీతంగా పెరిగిపోతుంది. ఆకలి చచ్చిపోతుంది. ఉదయాన్నే తినే ఆహారమే మీ ఆకలి పెంచుతుంది. అందువలన ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడం మరచిపోవొద్దు.