కీరదోస, మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడినవారికి దోసకాయ తినడం వల్ల మేలు కలుగుతుంది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను సరిచేస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.
కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించగలవు. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులోని సల్ఫర్, సిలికాన్ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి.