రుతు, లైంగిక రుగ్మతలను దూరం చేసే అవిసె గింజలు

ఆదివారం, 26 నవంబరు 2017 (15:09 IST)
అవిసె గింజలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. లైంగిక రుగ్మతలను దూరం చేస్తాయి. ఇందులోని ఒమేగా-3 ఆమ్లాల వల్ల లైంగిక సమస్యలు దూరం కావడంతో పాటు హృద్రోగాలు, కీళ్ల వాతం, ఉబ్బసం, మధుమేహం వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ గింజల్లోని ఫోలిక్‌ యాసిడ్‌ యాంటీ-ఏజింగ్‌కు మంచి మందుగా పనిచేస్తుంది. 
 
అవిసెగింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్నిశుద్ధి చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అవిసె నూనె చండ్రును దూరం చేస్తుంది. చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ గింజల్లోని పైటో ఈస్ట్రోజన్స్‌ రుతుక్రమ సమస్యలనుంచి మహిళలను కాపాడతాయి. బహిష్టువేళల్లో వచ్చే నొప్పులు కూడా అవిసెగింజలతో తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు అవిసె గింజల్లో మెండుగా ఉన్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు