అల్లం టీ అద్భుత ప్రయోజనాలు...

సోమవారం, 13 ఆగస్టు 2018 (10:35 IST)
ఈ కాలంలో అప్పుడప్పుడూ కురిసే వర్షాల వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు అల్లం టీ చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. మరి ఈ అల్లం టీలో గల ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
అల్లం టీలో విటమిన్ సి, మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఈ అల్లం టీని ఎలా చేయాలో చూద్దాం. కప్పు నీటిలో కొద్దిగా అల్లం తరుగు, టీపొడి వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత వడకట్టుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
పాలతో చేసుకునే టీలో కూడా కొద్దిగా అల్లం ముక్కను వేసుకుని వడకట్టి తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధశక్తిని పెంచుటలో చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. 
 
అల్లంలో ఉండే ఖనిజాలు, అమినోయాసిడ్స్ రక్తప్రసరణ సక్రమంగా జరుగేలా చేస్తాయి. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా అధికబరువు తగ్గుతారు. మహిళలకు నెలసరి సమస్యలో వచ్చే నొప్పులు కూడా తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు