బెండకాయ కూర అంటే చాలా మంది ఇష్టపడతారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు కూరల్లో ఎక్కువగా వాడతారు. అయితే బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయల వల్ల ఉన్న ప్రయోజనాలు చూద్దాం.
బెండకాయల్ని నిలువుగా చీల్చి రెండు భాగాలుగా గ్లాసుడు నీటిలో నీటిలో రాత్రంతా ఉంచి మర్నాడు ముక్కలు తీసి వేసి ఆ నీటిని తాగితే షుగర్ అదుపులో ఉంటుంది. బెండకాయల్లో ఎక్కువగా ఉండే ఎ, బి, సి విటమిన్లు పలు పోషక పదార్థాలు, అయోడిన్ అనేక రకాల అనారోగ్యాలకు చెక్ పెడతతాయి. బెండకాయలు తింటే విజ్ఞానం, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట.