ఎంఎం కీరవాణికి పితృవియోగం....

ఠాగూర్

మంగళవారం, 8 జులై 2025 (09:55 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు, అకాడెమీ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివదత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
శివశక్తి దత్త కేవలం కీరవాణి తండ్రిగానే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమలో రచయితగా తనదైన ముద్ర వేశారు. "బాహుబలి", "ఆర్ఆర్ఆర్", "ఛత్రపతి", "సై", 'రాజన్న' 'హనుమాన్' వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఆయన అద్భుతమైన పాటలురాశారు. అంతేకాకుండా, కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా కూడా ఆయన సేవలు అందించారు.
 
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శివశక్తి దత్త పెద్దనాన్న అవుతారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌కు ఆయన స్వయానా సోదరుడు. శివశక్తి దత్త మరణంతో కీరవాణి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు