నవ్వితే మేలెంత.. అంటువ్యాధులు రావట.. నిజమా..?

సోమవారం, 12 అక్టోబరు 2015 (18:27 IST)
నవ్వితే మేలెంతో ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు బాగుండాలంటే నవ్వాలని.. తద్వారా అంటువ్యాధులు సోకవని వారు చెప్తున్నారు. హృద్రోగులకు హాస్యయోగా ఎంతో మేలు చేస్తుంది. రక్తసరఫరా జరగకపోవటం, నవ్వును చికిత్సా విధానంగా పాటించినప్పుడు రక్తసరఫరా మెరుగవుతుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. గుండెపోటు వచ్చిన తర్వాత, బైపాస్ సర్జరీ అయిన తరువాత కూడా హాస్యయోగా చేయవచ్చు. 
 
మానసికంగా వ్యతిరేక ఆలోచనలతో సతమతమయ్యేవారు, భయం, కోపం, ఆందోళనలకు గురయ్యేవారిలో ఈ రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివలన తరచూ అనారోగ్యం వస్తుంది. 
 
నవ్వు రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మనసారా నవ్వినప్పుడు శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ముక్కు రంధ్రాల దగ్గర, శ్వాస నాళాల దగ్గర తెల్లరక్తకణాల పెరుగుదల అధికంగా చేరటం వైద్యులు ధృవీకరించారు. కాబట్టి నవ్వినప్పుడు పెరిగిన తెల్లరక్త కణాలు శరీరంలోకి ప్రవేశించి సూక్ష్మజీవులను సంహరిస్తాయి. హాయిగా నవ్వేవారికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బులు రావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి