కలరా వ్యాధితో బాధపడేవారు... ఉల్లిపాయలు తీసుకుంటే?

మంగళవారం, 28 ఆగస్టు 2018 (10:44 IST)
ఉల్లిపాయల్లో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించుటలో ఉల్లిపాయలు చక్కగా పనిచేస్తాయి. ఎముకల బలాన్ని పెంచుతాయి. రక్తాన్ని శుభ్రం చేయుటలో ఉల్లిపాయలు చాలా ఉపయోగపడుతాయి. జ్ఞాపక శక్తిని పెంచుటలో ఉల్లిపాయలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
  
 
అలర్జీలను తగ్గిస్తాయి. మూత్ర సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. కలరా వ్యాధిని తగ్గించడంలో ఉల్లిపాయలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి6, బి1, బి9, కాపర్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నిద్రలేమి వంటి సమస్యలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.
 
శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు చాలా ఉపయోగపడుతాయి. రక్తహీనత వంటి సమస్యలకు ఉల్లిపాయలు చాలా మంచివి. తేనెటీగలు కుట్టినప్పుడు వచ్చే నొప్పులకు ఉల్లిపాయను మిశ్రమంలా చేసుకుని ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు