జీలకర్ర-బెల్లం బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా కట్టుకొని పురుషులు తింటే...?

బుధవారం, 7 ఆగస్టు 2019 (21:27 IST)
జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీల గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి, గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకు గలదు. 
 
అంతేకాదు వీర్యపుష్టి బలహీనంగా వున్నావారు, జీలకర్ర, బెల్లం, బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా కట్టుకొని ఉదయం, రాత్రి తింటే వీర్యపుష్టి కలుగుతుంది. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు, బి.పిని, షుగర్‌ను కంట్రోలులో ఉంచుతుంది. 
 
అజీర్ణంతో బాధపడేవారు, వికారంగా వున్నప్పుడు, అరగక పుల్లని త్రేన్పులతో బాధపడేవారు జీలకర్రను నములుతూ రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. 
 
కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవాలి. మొలలతో బాధపడేవారు, జీలకర్ర, పసుపు కొమ్ములు సమానంగా కలిపి మెత్తగా దంచి, కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజు మూడు పూటల రెండు మాత్రలు చొప్పున వాడితే మొలల బాధ తగ్గుతుంది. ఈవిధంగా మన వంటింట్లో వాడే దినుసులతో ఆరోగ్యన్ని కాపాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు