ఆకలిని తగ్గించడంలో మిరియాల టీ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్వీట్లు, అధిక క్యాలరీలు ఉన్న ఆహారం, టీ, కాఫీ, జ్యూస్‌లకు బదులుగా మిరియాల టీని తాగితే బరువు తగ్గుతారని వైద్యులు అంటున్నారు. మిరియాల టీతో మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
నిజానికి మిరియాల టీ తాగటం వలన శరీర బరువు తగ్గదు, ఈ మిరియాల టీతో పాటుగా, సరైన ఆహార పదార్థాలు, వ్యాయామాలు కూడా చేయాలి. మిరియాల టీ తాగడం వల్ల ఆకలి అనిపించకుండా చూస్తుంది. ఈ టీ తీసుకోవడం వలన కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, మల ప్రవాహాన్ని పెంచుతుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలతో చేసిన టీలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి.