మధుమేహంతో బాధపడేవారికి వంకాయ చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది. అధిక విటమిన్స్ కూడిన ఈ వంకాయలో ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి.
కొలెస్ట్రాల్‌ను తగ్గించికోవాలంటే వారానికి రెండు సార్లు వంకాయను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఇందులో మినరల్స్, విటమిన్స్, కార్బొహైడ్రెట్స్, ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది.