మనం చర్మ సౌందర్యానికి పలు రకాల క్రీంలు, పౌడర్లు లాంటివి వాడతుంటాం. ఇవి కనుక సరిపడకపోతే చర్మం పాడైపోతుంది. వీటికన్నా ప్రకృతిలో సహజంగా లభించే కొన్నింటిని ఉపయోగించి మన చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవచ్చు. మనం చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోని పదార్దాలతోనే మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
1. కలబంద గుజ్జు సౌందర్య సాధనాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ మరియు బెటాకేరటిన్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలను, మొటిమలను వంటి సమస్యలను నివారించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.