చికెన్ సూప్ తీసుకుంటే జలుబు తగ్గిపోతుందా?

బుధవారం, 21 నవంబరు 2018 (18:48 IST)
తుమ్ములతో ముక్కు కారిపోతూ ఉంటే చికెన్ సూప్ కంటే మించింది లేదని కొందరు చెపుతారు. మరికొందరు అల్లం, తేనె కలిపిన టీ, నిమ్మకాయ పనిచేస్తుందంటారు. అయితే సాధారణ జలుబు అయినా దానిపట్ల మరింతగా శ్రద్ధ వహించవలసిందే. 
 
తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు. 
 
ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. అందువల్ల జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెపుతారు. 
 
జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు