పొద్దున్నే నిద్రలేవగానే తేనీరో లేదా కాఫీనో తీసుకుంటుంటారు. కొందరికి ఉప్మా మీద పంచదార చల్లుకుంటే గానీ తిన్నట్టుండదు. ఇంకొందరికైతే సాయంత్రమైందంటే చాలు.. బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. ఇలా చేప్పాలంటే కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తింటారు. చాలామంది వీటిని అంతగా గమనించరు. వీటిల్లో కంటి కనపించకుండా బోలెడంత చక్కెర దాక్కొని ఉంటుంది.
తీపి పానీయాలు తీసుకున్నప్పుడు మూడ్, ఉత్సాహం పెరిగినట్టు అనిపిస్తుంది. వీటిల్లో ప్రోటీన్స్, పీచు వంటివేవీ లేకపోవడం వలన త్వరలోనే శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా ఉత్సాహం ఆవిరవుతుంది. అలానే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది. ఇతర రకాల చక్కెరలా కాకుండా ఫ్రక్టోజ్ పూర్తిగా కాలేయంలోనే జీర్ణమవుతుంది.