ఈ మధ్యకాలంలో చాలామంది మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు విపరీతమైన మోకాళ్ళ నొప్పి సమస్య వస్తూ ఉంది. మన జీవనశైలి మారడం వల్ల ఆహారపు అలవాట్ల మారడం వల్ల ఈ మధ్యకాలంలో ముప్పై సంవత్సరాలు పైబడిన వారిలో కూడా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు విపరీతంగా బాధిస్తూ ఉన్నాయి.
నేచురల్‍గా మోకాళ్ళ నొప్పులను తగ్గించుకునే మార్గాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తలంబ్రాలు చెట్టు మోకాళ్ళ నొప్పులకు మంచి ఔషధమట. గ్రామాలలో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. చెరువు కట్టలు, పిల్ల కాలువల పక్క గానీ ఆ కాలువలో ఇరువైపులా మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి.