ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో బ్రష్ చేసే విధానం గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరు. దానికి కూడా కొన్ని దిశానిర్దేశాలున్నాయి. బ్రష్ చేసే విధానంలో ముందుగా బ్రష్‌పై పేస్ట్ వేసుకుని ముందు పళ్లపై పైకి క్రిందికి మూడుమూడు సార్లు రుద్దాలి. ఆ తర్వాత పక్క పళ్లను రుద్దుతూ మీ బ్రష్‌ను వెనుకకు ముందుకు కదపండి. ఆ తర్వాత కుడి- ఎడమవైపుకు తిప్పండి. ఇలా నోట్లోనున్న అన్ని దంతాలకు బ్రష్ చేయండి. దీంతో దంతాలు శుభ్రమై నోట్లో దుర్వాసనను నిరోధిస్తోంది.
* రాత్రిపూట కూడా బ్రష్ ఇలాగే చేయాలంటున్నారు వైద్యులు.
* బ్రష్ చేసేటప్పుడు మీ శక్తినంతా పళ్లపై ప్రయోగిస్తూ బ్రష్ చేయకండి.
* పైన చెప్పిన చిట్కాలను పాటిస్తూ మీ దంతాలను కాపాడుకోండి. తమలపాకు, పొగాకు, గుట్ఖా, సిగరెట్టు తదితరాలను సేవించకండి. కాసింత దంత సమస్య ఏర్పడినట్టుంటే వెంటనే దంత వైద్యనిపుణుడిని సంప్రదించండి. మీరు మీ దంతాలను కాపాడుకుంటుంటే ఆ దంతాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.