ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఊపిరితిత్తులను ఇలా క్లీన్ చేసుకోవచ్చు

బుధవారం, 30 అక్టోబరు 2019 (22:28 IST)
ఊపిరితిత్తులు క్లీన్ కావాలంటే వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. నేడు ఎక్కడ చూసినా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య ఒకటి. మన ఊపిరితిత్తులు ఎఫెక్టివ్‌గా ఉంటే అనారోగ్యం బారిన నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు వైద్యులు.
 
ఉల్లిపాయలు.. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను క్లీన్ చేస్తాయి. అల్లం తింటే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపుతాయి. క్యారెట్ జ్యూస్ తాగితే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. వారానికి నాలుగుసార్లు ద్రాక్ష పండ్లు తీసుకోవాలి. 
 
రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ అనంతరం పుదీనా టీ తాగితే ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. రోజూ 300 ఎం.ఎల్. పైనాపిల్ జ్యూస్ తాగితే మంచిది. రోజూ ఉదయాన్నే పరగడపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు