నెయ్యిలో అనేకమైన సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నెయ్యి చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది వివిధ రకాల చర్మ సమస్యలతో పాటు చర్మం పొడిబారకుండా నివారిస్తుంది. నెయ్యిలో పుష్కలంగా ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పొడిబారిన చర్మానికి అవసరమైన తేమను అందించి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. కొద్దిగా నెయ్యిని చేతిలోకి తీసుకుని ముఖానికి రాసి, మసాజ్ చేయడం వల్ల డ్రై స్కిన్ కంట్రోల్ అవుతుంది.
* చర్మాన్ని మృదువుగా చేస్తుంది:
నెయ్యితో పాటు కొద్దిగా నీరు తీసుకుని, రెండింటినీ బాగా మిశ్రమంగా కలిపి చర్మానికి రాయాలి. కొంతసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం నిగనిగలాడేందుకు నెయ్యి అద్భుతంగా సహాయపడుతుంది. కళ్ల క్రింద నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు, ప్రతిరోజూ రాత్రి నిద్రించడానికి ముందు కళ్ల క్రింది భాగంలో నెయ్యిని రాయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి.
* జట్టు చిట్లకుండా చేస్తుంది:
డ్రై హెయిర్ కారణంగా జట్టు తరచూ చిట్లుతుంటుంది. ఈ సమస్యకు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యిని గోరువెచ్చగా కాచిన తర్వాత, జుట్టు కొసలకు అప్లై చేయాలి. ఇలా చేసిన 1 గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా జుట్టు చిట్లడం తగ్గుతుంది. అంతేకాకుండా నెయ్యిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించిన అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి మంచి కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది.