గింజలు మాత్రమే తినే సాధారణ బఠాణీలనే గార్డెన్ పీస్ అంటారు. ఇవికాకుండా చిక్కుడుకాయ మాదిరిగా బఠాణీ మొత్తాన్ని తినే షుగర్ స్పాప్ పీస్, స్నో పీస్.. వంటి రకాలూ వున్నాయి. కానీ స్నో పీస్ మాత్రం తప్ప చిక్కుడుకాయల్లా వుంటాయి. అందువల్ల వీటిని కూరలూ సలాడ్లలో నేరుగా వాడుతుంటారు. వంద గ్రాముల కాయల్లో 42 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి.
కానీ వీటిలో విటమిన్ - సి, కెలతోబాటు ఇతరత్రా ఖనిజాలు ఎక్కువే. కాయను మొత్తంగా తినడం వల్ల వీటిల్లో పీచూ ఎక్కువే. అందువల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో బాటు మలబద్ధకాన్నీ ఊబకాయాన్నీ నివారిస్తాయి. అదేసమయంలో సాధారణ బఠాణీల్లోని ఇతర పోషకాలన్నీ వీటిల్లోనూ లభ్యమవుతాయి. ఆస్తమా, ఆర్ద్రైటిస్, గౌట్ వ్యాధులు వున్నవారికి స్నో పీస్ మందులూ ఎలా పనిచేస్తాయి. తరచూ జలుబూ జ్వరాలతో బాధుపడేవాళ్లు వీటిని సూపుల్లో వేసుకుని తీసుకుంటే మంచిదట.