నాగజెముడు పండ్ల పైతోలును తీసి తినేటపుడు వాటిలోని విత్తనాలను తీసేయాలి.
నాగజెముడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా వున్నందున తెల్లరక్తకణాలు వృద్ధి చెందుతాయి.
ఈ పండ్లలో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది కనుక ఎముకలకు బలం చేకూరుతుంది.
నాగజెముడు పండ్లను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
శరీరంలో చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచే గుణాలు ఇందులో వున్నాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు నాగజెముడు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
కాలేయం ఆరోగ్యం వుండేందుకు నాగజెముడు పండ్లను ఉపయోగిస్తుంటారు.
కొంతమందికి వీటిని తింటే తేలికపాటి విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి వంటివి రావచ్చు.