ఎసిడిటి... ఈ సమస్య చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుండి బయట పడాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇదివరకు భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది. కానీ బెల్లం వల్ల గ్యాస్ ఎంతగానో తగ్గుతుంది. బెల్లం లోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని మంచినీళ్ళు తాగండి. మళ్ళీఉదయాన్నే నిద్రలేస్తునే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. ఉపశమనం లభిస్తుంది.
పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. తరువాత వాటిని చల్లార్చి సేవించండి. రోజూ అలా చేస్తే వారం, పదిరోజులలో గ్యాస్ కొంతవరకైన తగ్గుతుంది. ఈ రసం వలన దగ్గు, జలుబు కూడా నివారించవచ్చు. మనం రోజూ తీసుకునే మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ కడుపులోని గ్యాస్‌కు కళ్లెం వేస్తుంది.