అరటి పండులో పోషకాలెన్నో వున్నాయి. అరటి పండు కంటే అరటి పువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. అరటిపువ్వు వంటకాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పోపు గింజలు వేసి.. వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేపుకోవాలి. అందులో కట్ చేసిన అరటి పువ్వు ముక్కల్ని చేర్చుకోవాలి.
అందులోనే ఉప్పు, కొద్దిగా ఇంగువ, కరివేపాకులు, ధనియాల పొడి, కొత్తిమీర, పసుపు కూడా చేర్చి.. కొంత నీరు పోసి పాత్రపై మూత పెట్టేయాలి. కొంత సేపటి తరువాత సన్నగా తురిమిన కొబ్బరి పొడిని వేయాలి. అంతే అరటిపువ్వు కూర రెడీ అయినట్లే ఈ కూరను వారానికోసారైనా ఆహారంలో చేర్చుకుంటే.. మహిళల్లో నెలసరి సమస్యలు తొలగిపోతాయి.
డయాబెటిస్ ఉన్నవారు అరటిపువ్వు కూరను తరచూ తింటుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. అరటిపువ్వు కూర వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ వంటివి దూరమవుతాయి. అరటి కూరను తీసుకుంటే హైబీపీ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.