చింత గింజలను పాలతో కలిపి తీసుకుంటే? కీళ్ల నొప్పులకు?

సోమవారం, 25 జూన్ 2018 (10:40 IST)
చింత గింజలను బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు రెండుసార్లు ఆ నీటిని మార్చాలి. రెండు రోజుల తరువాత చింత గింజలను తీసి వాటి పొట్టును వేరుచేయాలి. అనంతరం వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టాలి. ఆ తరువాత వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి.
 
చూర్ణంగా చేసిన పొడిని ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో పాలలో కలుపుకుని అందులో కాస్త చక్కెరను వేసుకుని తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చును. ఈ గింజలలో ఔషధ పదార్థాలు ఎముకల బలానికి చాలా దోహపడుతాయి. అదేవిధంగా కీళ్లలో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి చేస్తాయి.
 
ఈ చింత గింజల మిశ్ర‌మంతో కీళ్ల నొప్పులే కాదు చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధిత స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగనిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజు చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు