కుంకుడు రసంతో పట్టుచీరను ఉతికితే...?

శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:29 IST)
వెంట్రుకలు పెరగడానికి కుంకుడు కాయలు చాలా ఉపయోగపడుతాయి. కుంకుడు కాయలను బాగా ఎండబెట్టుకుని పొడిచేసి నిల్వచేసుకోవాలి. తలస్నానం చేసిన ప్రతీసారీ వీటిని కొట్టుకునే శ్రమ తప్పుతుంది. కుంకుడు కాయల పొడిలో కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపువ్వులు, మెంతుల పొడిని కలుపుకుని తలస్నానం చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
 
ఇలా చేయడం వలన జుట్టు ఊడిపోకుండా మృదువుగా ఉంటుంది. కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే కేశాలు జిడ్డులేకుండా శుభ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఎటువంటి రసాయన పదార్థాలు ఉండవు. కుంకుడు కాయ రసంలో పట్టుచీరను నానబెట్టి ఉతుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. తద్వారా పట్టుచీరలు మెరుస్తాయి. బంగారు ఆభరణాలను కుంకుడు రసంలో నానబెట్టుకుని మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే ధగధగా మెరుస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు