అవి శృంగార శక్తిని తగ్గిస్తాయి... జాగ్రత్త...

బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:03 IST)
ప్రతిరోజూ తీసుకునే పదార్థాల్లో కొన్ని రుచులు కలిగినవి ఆరోగ్యం పైన రకరకాల ఫలితాలను చూపిస్తుంటాయి. ఏయే రుచి పదార్థాలు ఎలాంటి ఫలితాలను కలుగజేస్తాయో చూడండి.
 
1. తీపి పదార్థాలు కఫ దోషం కల్గిస్తాయి. పాత బియ్యం, బార్లీ, పెసలు, గోధుమ, తేనే. పంచదార, మెట్ట ప్రాంతాల్లో ఉండే జంతువుల మాంసం ఇందుకు మినహాయింపు.
2. పులుపు పదార్థాలు పిత్త దోషం పెంచుతాయి. దానిమ్మ, ఇండియన్ గూస్‌బెర్రీలు తప్ప. 
3. రాతి ఉప్పు తప్ప మిగిలిన ఉప్పటి పదార్థాలు కంటికి మంచివి కావు.
4. లైంగిక శక్తిని తగ్గించేవి- శొంఠి, అల్లం తప్పించి మిగిలిన వగరు పదార్థాలు. 
5. చేదు పదార్థాల్లో పొట్ల వంటివి తప్పించి మిగిలినవి స్టిఫ్‌నెస్ కల్గిస్తాయి.
6. కారం, పులుపు, ఉప్పటి పదార్థాలు ఆ వరుస క్రమంలో చలవ వేస్తాయి. 
7. చేదు, కారం, వగరు, తీపి పదార్థాలు అదే వరుస క్రమంలో వేడిచేసే పదార్థములు. 
8. చేదు, కారం, వగరు పదార్థాలు మలబద్దకం కలిగిస్తాయి. 
9. ఉప్పు, పులుపు, తీపి పదార్థాలు సుఖ విరోచనం కలగజేస్తాయి. మూత్రం, కఫం తొలగిస్తాయి. 
10. తీపి, పులుపు, ఉప్పు కఫం కలిగిస్తాయి, వాతం తగ్గిస్తాయి.
11. చేదు, వగరు, ఉప్పు-వాతం కలిగిస్తాయి. మరియు కఫం తగ్గిస్తాయి.
12. తీపి, చేదు, వగరు- పిత్త దోషం ఉపశమింపజేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు