శాకాహారంతో ఆయుర్దాయం పెంచుకోండి.. కొవ్వును రోజూ 5 శాతం తగ్గించినా మేలే!

శనివారం, 9 జులై 2016 (16:40 IST)
శాకాహారంతో ఆయుర్దాయం పెరుగుతుందని.. రోజుకు ఐదు శాతమైనా శరీరంలో ఫాట్ తగ్గించుకుంటే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారని.. జీవితకాలాన్ని పెంచుకున్నట్లవుతుందని వైద్యులు చెప్తున్నారు. ఇంకా మాంసాహారం లేనిదే ముద్ద దిగదనుకుంటే ఆయుర్దాయాన్ని మరిచిపోవాల్సిందని వారు సూచిస్తున్నారు. శాకాహారం తినే వారిని, మాంసాహారం తీసుకునేవారితో పోల్చితే.. వెజ్ ఫుడ్స్ తీసుకునే వారిలో గుండె పనితీరు మెరుగ్గా ఉందని తేలిందని హార్వర్డ్ వర్శిటీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. 
 
శరీరంలో పేరుకుపోయే కొవ్వుతో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని.. పెరుగు, వెన్న, మాంసాలలో ఉండే కొవ్వు పదార్థాలను ఎక్కవగా తీసుకున్నవారి జీవిత కాలంతో పోలిస్తే కొవ్వులేని పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు కాస్త మెరుగ్గా ఉందని పరిశోధనలో తేలింది. ఆలీవ్, సోయాబీన్‌ల నుంచి తీసిన వెజిటేబుల్ ఆయిల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మాంసాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని వాటిని తగ్గించుకుంటే.. అంటే మాసానికి ఓసారి లేదా రెండుసార్లు తీసుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి