బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్. మనకు సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. శక్తినిచ్చే శాఖాహారదుంపల్లో బీట్‌రూట్‌ది మొదటి స్థానం. బీట్ రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి నైట్రేట్ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్నిఅరికడుతుంది.
అంతేకాదు బీట్ రూట్‌లోని పుష్కలమైన ఐరన్, వ్యాధి నిరోధకతకు పెంచుతుంది, కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోజుకి ఓ గ్లాసుడు బీట్‌రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదపడుతుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.