ఎక్కువసేపు ఖాళీ కడుపుతో వున్నవారిలో కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది. ఈ ఎసిడిటీ తలెత్తడానికి కారణాలు ఇదే కాకుండా చాలానే వున్నాయి. ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసు, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి ఆ తర్వాత భోజనం తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
1. తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాకొలేట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.