చేతివేళ్ళతో ఆహరం తీసుకోవడం వలన, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతికి ఆహరం తాకగానే, ఆహరం తీసుకునే విషయం మెదడు మన పొట్టకు సంకేతమిస్తుంది. అలా సంకేతం ఇవ్వగానే జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణ శక్తి భాగా పెరుగుతుంది.
చేతితో ఆహరం తీసుకోవడంతో మనకు ఎంత ఆహరం సరిపోతుందో మనకు ముందే తెలిసిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక ఆహారాన్ని ప్లాస్టిక్ ఫ్లేట్‌లలో కాకుండా రాగిపళ్లెంలో తినడం ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుంది. ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ లేదా అల్యూమీనియం స్పూన్స్‌తో వేడి పదార్థాలు తినడం వలన ఆ వేడికి కొద్దిగా కరుగుతాయి. ఇలా కరిగిన రసాయనాలు ఆహారంతో మన పొట్టలోకి చేరుతాయి. ఇవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.